భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 11, 12 వ తేదీలలో విశాఖపట్నంతేదీలలో విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 10,742 కోట్ల విలువ చేసే ఐదు నూతన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పూర్తయిన రెండు ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేస్తారు. ఇందుకోసం ప్రధాని ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం కి చేరుకుంటారు.
ఆరోజు సాయంత్రం 5:30 గంటలకు మధురై విమానాశ్రయం నుండి బయలుదేరి.. రాత్రి 7:25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 12వ తేదీ 11:45 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే మోడీ విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్ కు ఆహ్వానంపై ఎంపీ జీవీఎల్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానంపై పిఎమ్ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన కాబట్టి ఎవరూ రాజకీయ కోణంలో చూడద్దని హితవు పలికారు. మోడీ ఒకటిన్నర రోజులు విశాఖలో ఉండడం వైజాగ్ ప్రజలకు గర్వకారణం అన్నారు జి.వి.ఎల్.