వేసవి వచ్చేసింది. మార్చిలోనే మే నెలను తలపించే ఎండలు కొడుతున్నాయి. ఇక ఉక్కపోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం 9 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు. సూర్యుడి భగ భగలకు చాలా మంది మధ్యాహ్నం పూట ఇంటి పట్టునే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు ఈనెల 15వ తేదీన ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చే శారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించి పిల్లలను ఇంటికి పంపాలి. పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నందున ప్రత్యేక తరగతులను కొనసాగించాలని ఆదేశించారు.
విద్యార్థులకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నందున వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం. చేశారు. విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.