శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య నడుస్తున్న యుద్ధం.. ఓ విధంగా ఎటు పోతుందో ఎవ్వరూ తేల్చలేని వైనం..ఇవాళ్టి పరిణామం. రాజధాని విషయమై ప్రభుత్వం చెబుతున్న మాటలో స్పష్టత పైకి కనిపిస్తున్నంతగా లోపల లేదు. లోపల చాలా జరిగి పైకి చాలా తేలుతున్నాయి. అయినా కూడా కేంద్రం తన పని తాను చేసుకుని పోయి రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులేవో ఇస్తుంది.
శాసన వ్యవస్థలను న్యాయ వ్యవస్థలు శాసించలేవు అన్నది నిన్నటి వేళ ధర్మాన స్పష్టం చేసిన విషయం. అదేవిధంగా ఆయనొక సీనియర్ లెజిస్లేచర్ కనుక శాసన వ్యవస్థ ఎలా ఉంది ఎలా ఉంటే బాగుంటుంది దానిని న్యాయ వ్యవస్థ ప్రభావితం చేసే విషయాలు ఏమయినా ఉన్నాయా గతంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి అన్నవి కాస్త వివరంగానే చెప్పారు.
జగన్ మాత్రం తెలివిగా ఈ విషయాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఎలా అంటే తాను ఒక పార్టీగా ఉన్న విషయాన్ని మరిచిపోయి ఆ రోజు తాను అమరావతిని స్వాగతిస్తున్నాను అని చెప్పిన విషయం మరిచిపోయి రాజధానుల నిర్ణయంపై ఓ ముఖ్యమంత్రి హోదాలో తనకు ఉన్న హక్కు ల గురించి మాట్లాడుతున్నారు. బాగుంది మరి! రైతులకు మీరేం సాయం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని రేపటి వేళ కొత్తగా కొలువుదీరే శాసన సభ ఎందుకు అమలు చేయాలి.. అంటే ఈ డైలమా ఇలానే కొనసాగడం ఖాయం అని చెప్పకనే చెబుతున్నారా?
మళ్లీ ధర్మాన స్పీచ్ దగ్గరకే వద్దాం. ఆయనేం అంటున్నారు రెండు గౌరవ వ్యవస్థలకు ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటూనే పనిచేయాలి. చట్ట సభలు చట్టాలు చేయాలి..న్యాయ వ్యవస్థలు వాటి పరిధి మేరకు స్పందించాలి. చట్టసభలు చట్టాలు చేయవద్దంటే ఎలా ? అని మాట్లాడారు. అంటే రాజధాని విషయంలో కోర్టు చెప్పిన మేరకు ఇప్పటి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం ఎక్కడా చెప్పలేదు.ఆయన గతంలో జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ జగన్ సర్కారు నిర్ణయాలు వాటిని ఏ విధంగా అర్థం చేసుకుంది అన్నది మాత్రం పెద్దగా వివరించలేదు.
అంటే జగన్ కు ఉన్న ఉద్దేశాన్ని ఓ ఎమ్మెల్యే హోదాలో వివరించే ప్రయత్నం ఏదీ చేయలేదు కానీ న్యాయ వ్యవస్థ పరిధి ఎందాక.. చట్ట సభ పరిధి ఎందాక అన్నవి గతంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా చెప్పారు. ఇదంతా చరిత్ర వీటిని ఫాలో కావడం ఇప్పటి తరానికి కష్టం కానీ జగన్ లాంటి ముఖ్యమంత్రులు మళ్లీ పాత పాటే పాడుతారు. అదేవిధంగా తాము చేయాలనుకున్నదేదో చేసి చివర్లో రాజధాని రైతులకు కూడా సాయం చేస్తాం అని చెబుతారు.. ఇదీ ఇవాళ్టి డైలమా..