భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు

-

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసారు. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

CM Revanth Reddy's instructions to officials in the wake of heavy rains
CM Revanth Reddy’s instructions to officials in the wake of heavy rains

హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, ట్రాఫిక్‌, పోలీసు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, నల్లొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలో అక్కడకక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news