హిందీలో 50 కోట్ల క్లబ్ లోకి హనుమాన్….

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.ఈ మూవీ సక్సెస్ పై ప్రేక్షకులే కాకుండా ప్రముఖులు ఎంతో మెచ్చుకున్నారు.

- Advertisement -

ఇక ఈ మూవీ దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి ఇప్పుడు మరో ఆసక్తికరమైన మైలురాయి కూడా దాటేసింది. అసలు విషయం ఏమిటంటే హనుమాన్ సినిమా హిందీలో 50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.దక్షిణాది నుంచి వెళ్లి అక్కడ 50 కోట్ల పైగా కలెక్ట్ చేసిన 11వ సౌత్ సినిమాగా నిలిచింది. ఇక సౌత్ నుంచి వెళ్లి 50 కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోలలో ఆరవ హీరోగా తేజా నిలిచాడు. ఇప్పటి వరకు రజనీకాంత్,ప్రభాస్, అల్లు అర్జున్, యష్, రక్షిత్ శెట్టి వంటి వారికి మాత్రమే అక్కడ 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...