తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది.ఇక ఈ సభలో కాంగ్రెస్ మంత్రులు, సభ్యులు చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.కాగా ఈ సభలో చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు అద్భుత ప్రదర్శన చేశారని కేటీఆర్ ప్రశంసించారు.
కృష్ణా జలాలు/కేఆర్ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలు, అబద్ధాలన్నింటినీ ఒంటరిగా తిప్పికొట్టారని ట్వీట్ చేశారు. ‘రేపటి ఛలో నల్గొండకు పార్టీ శ్రేణులు సిద్ధంకండి. అక్కడ కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతారు’ అని రాసుకొచ్చారు.కాగా రేపు జరగబోయే పోరు సభకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.