పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కానుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా… ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నైజాం ఏరియాలో ఓజి సినిమా ఫస్ట్ టికెట్ ను వేలం పాట వేశారు.

ఈ కార్యక్రమం ట్విట్టర్ స్పేస్ లో నిర్వహించగా అమెరికా ప్రజలు తెలుగు రాష్ట్రాల వారు భారీగా పాల్గొన్నారు. ఈ టికెట్ ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ ఏకంగా రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఓజీ తొలి టికెట్ జనసేన పార్టీకి ఫండ్ గా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ నుంచి Glimpse రిలీజ్ చేశారు.