కడపలో స్మార్ట్ కిచెన్ ను లోకేష్ ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారిగా కడప జిల్లా సి.కె. దిన్నె MPP హైస్కూల్ లో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కమలాపురం, జమ్మలమడుగు, కడపలో మరో ఐదు కిచెన్లను వర్చువల్ గా ప్రారంభించారు. 12000 మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న సమయంలో భోజనం అందించనున్నారు.

డిసెంబర్ నాటికి కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు భోజనం అందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా ఏపీలో విద్యార్థులకు అనేక రకాల మంచి పనులను చేస్తున్నారు. విద్యార్థులకు చదువులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అనేక రకాల చర్యలను చేపడుతున్నారు. కాగా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అనేక రకాల అభివృద్ధి పనులను చేస్తున్నారు. మరికొన్ని రోజులలో ఏపీలో నిరుద్యోగితను తరిమికొట్టేందుకు అనేక రకాల అభివృద్ధి పనులను చేస్తున్నారు.