వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధుల్లో ఇది ఒకటి. ఇది కేవలం జ్ఞాపక శక్తి మాత్రమే కాకుండా ఒక వ్యక్తిత్వాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స ఇప్పటివరకు లేదు కానీ దీనికి ముందుగానే గుర్తించగలిగితే వ్యాధి తీవ్రత కొంతవరకు నియంత్రించవచ్చు. అయితే అల్జీమర్స్ వ్యాధికి మన పేగు ఆరోగ్యానికి మధ్య ఒక బలమైన సంబంధం ఉందని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి..
సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే అల్జీమర్స్ మెదడులో బీటా-అమైలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఈ ప్రోటీన్ మెదడు కణాలను దెబ్బతీస్తుంది కానీ ఈ ప్రోటీన్ ఎందుకు పేరుకు పోతుంది. దీని వెనుక ఉన్న కారణాలపై పరిశోధనలు దృష్టి పెట్టారు. ఆసక్తికరంగా ఈ రహస్యాన్ని చేదించడంలో మన కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు గుర్తించారు.
మన పేగులో మైక్రోబయోమ్ అనే కొని రాకల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యం పై ముఖ్యంగా మెదడు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయి. పేగులోని ఈ మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అది శరీరంలో ఒక రకమైన వాపును సృష్టిస్తాయి. ఈ వాపు కేవలం పేగులకే పరిమితం కాకుండా మెదడుకు కూడా వ్యాపిస్తుంది. ఈ వాపు కారణంగా మెదడులో అమైలాయిడ్ ప్రొటీన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అంటే ఈ పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అది అ భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధికి దారి తీసే అవకాశం ఉంది. ఈ పరిశోధన ప్రకారం అల్జీమర్స్ ఉన్న వారి పేగులలో కొన్ని రకాల సూక్ష్మజీవులు తక్కువగా ఉన్నాయని మరికొన్ని రకాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ మార్పులు జ్ఞాపకశక్తి తగ్గుదల ఆలోచన శక్తిలో మార్పులు వంటి లక్షణాలు కనిపించక ముందే మొదలవుతాయి.
గమనిక : ఈ సమస్య వున్నవారు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరం.పేగు సమస్యలు ఉన్నవారు వైద్యుని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.