ల‌వ్ ఫ‌ర్ ఎవ‌ర్ : హ్యాపీ మ్యారీడ్ లైఫ్ న‌య‌న్.. !

-

లైఫ్ లాంగ్ కోరుకున్న వాడితో కోరుకున్నంత! లైఫ్ లాంగ్ కోరుకున్న‌వన్నీ కోరినంత – ద‌రి చేరినంత ! అందాల తారల జీవితాల్లో కోరిక‌లే వెలుగు కార‌కాలు. దాంప‌త్య జీవితంలో సుఖం మ‌రియు దుఃఖం అనే వెలుగు చూస్తూ, వెలుగు వెంట తోడుగ న‌డిచే చీక‌టి చూస్తూ..అన్నింటినీ స్వీక‌రిస్తూ..సాగే జీవితంలో న‌య‌న్ బాగుండాలి అన్న‌ది ఓ విష్. ఓ హోప్ కూడా ! ఇంత‌కుమించి రాయ‌కుండా ఉంటే బెట‌ర్.! కొన్ని సార్లు మాట‌ల క‌న్నా ఉద్వేగాలే ఎక్కువ మంచి చేస్తాయి. అటువంటి అన్ కంట్రోల్డ్ ఇమోష‌న్స్ ఆమె జీవితంలో కూడా ఉంటే మేలు. క‌నుక ప్రేమ అనియంత్రితం … పెళ్లి నియంత్రితం కావొచ్చు ఇవాళ ఆ జంట విష‌య‌మై! మూడు ముళ్ల అడ్డ‌గింత‌ల్లోనో, అడ్డుగీత‌ల్లోనో, అప్ప‌గింత‌ల్లోనో, అవ‌రోధాలు అనుకునే దారుల్లోనో ఇప్ప‌టి అమ్మాయిలు ముఖ్యంగా గ్లామ‌ర్ ఫీల్డ్ నుంచి ఎదిగిన అమ్మాయిలు వీటి గురించి ఆలోచిస్తే .. ఈ రేయి హాయి.. ప్ర‌తి రేయీ హాయి.

ప్రేమ, పెళ్లి, శృంగారం ఈ ట్ర‌యాల‌జీలో మ‌నిషి త‌నని తాను తెలుసుకునే అవ‌కాశాలు క‌న్నా త‌న‌ని తాను కోల్పోయే సంద‌ర్భాలే ఎక్కువ. తార‌ల జీవితాల్లో ఆనందాలు, ఆశ్చ‌ర్యాలు క‌లిసి ఉంటాయి క‌నుక ఒళ్లంత తుళ్లింత‌లు నిండిన సమ‌యాలు కేవ‌లం వివాహ సంద‌ర్భాలే నిర్ణ‌యిస్తాయి అని అనుకోలేం. కొంత కాలం కాలం ఆగిపోతే తెలిసి వ‌చ్చేవి కొన్ని ఉంటాయి. ఆ విధంగా న‌య‌న్ ఇవాళ ఓ బిగ్ స‌ప్రైజ్ ఇచ్చి వెళ్లారు. ఇంతకుముందు ప్రేమ క‌థ‌లు ఎలా ఉన్నా కూడా వాటికి ముగింపు ఇస్తూ, ఏడేళ్ల కింద‌ట మొద‌లిడిన ప్రేమ క‌థ‌కు ఇప్పుడు ముగింపు ఇవ్వ‌డం, స‌హ జీవ‌న నేప‌థ్యాన్ని వీడ్కోలు ప‌ల‌కడం అన్న‌వి ఇప్పుడిక ఆనందాయ‌క ప‌రిణామాలు ఆమె జీవితాన !

అప్రియం అయినా, ప్రియం అయినా పెళ్లి పెళ్లే ! కనుక ఆమెకు ప్రియం అయినవి ఇత‌రుల‌కు అప్రియం అయి ఉన్నాయి ఇవాళ. ఆ విధంగా అందాల న‌య‌న‌తార ముందుగా నిర్ణ‌యించిన ముహూర్తం అనుసారం మ‌హాబ‌లిపురం(త‌మిళ‌నాడు)లో ద‌ర్శ‌కులు విఘ్నేశ్ ను మ‌నువాడింది. దైవ నిర్ణ‌యం అనుసారం ఆమె కొత్త జీవితం సాగాల‌న్న‌ది ఇప్ప‌టి నుంచి అభిమానుల మ‌రియు శ్రేయోభిలాషుల కోరిక ! ఇక ఏడేళ్ల ప్రేమ కార‌ణంగా న‌య‌న్ ఏమి నేర్చుకున్నారు ఏ విధంగా త‌నను అర్థం చేసుకున్నారు.. అన్న‌వి కూడా ఇవాళ ఎంతో ముఖ్యం. త‌నను అన‌గా జీవిత భాగ‌స్వామి విఘ్నేశ్ ను అని అర్థం..

మ‌నుషుల్లో ట్రూల‌వ్ ఉంటుందా.. ఎరేంజ్డ్ స్పేస్-లో కూడా ట్రూ లవ్ ఉంటుందా..మ‌నుషుల్లో ఎగ్జిస్టెన్స్ మాత్ర‌మే ఉంటుందా లేదా ఇంకేమ‌యినా కూడా ఉంటాయా.. ఇవ‌న్నీ ప్రేమ మ‌రియు పెళ్లితో తేల్చుకోద‌గ్గ విష‌యాలు. వాటితో పెన‌వేసుకున్న విష‌యాలు కూడా ! క‌నుక న‌య‌న్ పెళ్లి కార‌ణంగా ఆరంభం అయ్యే జీవితం కొత్త ఆనందాల‌ను వెతుక్కోవ‌డంతో పాటు ఎక్జిస్టెడ్ స్పేస్ లో ఇదివ‌ర‌క‌టిలా ఆమె మ‌న‌సు ఊగ‌క తూగ‌క స్థిరం అయి ఒక్క‌వైపే మొగ్గు చూపితే మేలు.

ప‌సుపు బ‌ట్ట‌లు క‌ట్టుకుని కొత్త ఇంట అడుగు పెడుతున్న న‌య‌న్ కు ఇవ‌న్నీ తెలుసు. తెలియ‌వు అని కాదు. కానీ ఆమె తెలిసీ, తెలియ‌ని త‌నంతో ప్రేమ క‌థ‌లు కొన్ని నడిపారు. క‌నుక కొంత విముఖ‌త ఆమె విషయంలో ఇత‌రుల‌కు ఉండ‌వ‌చ్చు. ఆ విధంగా ఆమె నిన్న‌టి ఇమ్మెచ్యూర్డ్ సెన్స్ ను వ‌దిలి జీవితాన్ని అర్థం చేసుకుంటే ఒక‌రికొక‌రు అన్న ప‌దంలో బాగా తెలిసిన ప‌దంలో కొన్ని క్ష‌ణాలు నిక్షిప్తం అయి ఉంటాయి. అవి జీవితాల‌ను సుఖ సంబంధిత తీరాల‌కు చేరుస్తాయి.

నిక్షిప్త కాలాల చెంత ప్రేమ., పెళ్లి అన్నీ బాగుంటాయి. పెళ్లితో పాటు జ‌రిగే కొన్ని ఆడంబారాలు కూడా ! ఆ త‌రువాత జ‌రిగే దేహాల క‌ల‌యిక కూడా ! మాలిన్య ర‌హిత ప్రేమ, మాలిన్య ర‌హిత శృంగారం, ఆ రెండూ జీవితాల‌ను క‌డ‌దాకా క‌లిపి ఉంచాలి అని ఆశించ‌డం ఇప్ప‌టి అభిమానుల బాధ్య‌త. డియ‌ర్ న‌యన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version