ఈసారికి బెజవాడలోనే… సంబురాల్లో టీడీపీ!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీకి రాజధాని ఒక్కటే ఉండాలని… అది కూడా అమరావతిలోనే ఉండాలని టీడీపీ నేతలంతా గగ్గోలు పెడతున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుకుంది. దీంతో ఈ ఏడాది విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు!

అవును… పరిపాలన వికేంద్రీకరణకు ఆమోదం వచ్చిన వెంటనే ఈ ఏడాది విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని మొదట అధికార వైసీపీ ప్రభుత్వం భావించింది. కానీ.. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన అంశంపై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో, వేడుకలను విశాఖలో కాకుండా ఈ ఏడాది విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ నేతలు కాస్త సంబురపడుతున్నారుట. ఎలాగూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అదే తరహాలో న్యాయపోరాటం చేస్తూ.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించేలా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారంట! అందుకు సంబంధించిన టీడీపీ నేతల్లో ఆనందంతో కూడిన హర్షేతిరేకాలు వ్యక్తమౌతున్నాయని అంటున్నారు.

అయితే ఓ పక్క ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని, ఆ రకంగా శకటాలను తీర్చిద్దిద్దాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version