బాబుకు మాటలతో చుక్కలు చూపిస్తోన్న రోజా… సరికొత్త సూచన కూడా!

-

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటుంది టీడీపీ. ఈ విషయంలో అధికార వైసీపీ మాత్రం వికేంద్రీకరణ మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ తో సంతకం చేయించుకొని అలా దూసుకుపోతుంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా మైండ్ బ్లాక్ అయి 48 గంటలకోసారి జూమ్ లో మాట్లాడతానంటూ తెలుగు తమ్ముళ్లు, రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా తనదైన శైలిలో స్పందించారు!

తాజాగా చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రోజా… చంద్రబాబుకి తెగింపు లేదని.. 48 గంటల్లో ఏదో పీకుతానని చెప్పి.. ఊరించి ఊరించి గాలి తీసేసుకున్నారని ఫైరయ్యరు. జగన్మోహన్ రెడ్డి.. ధమ్ము, ధైర్యం పుష్కలంగా ఉన్న నేత అని.. అసలు జగన్ ధైర్యం గురించి సోనియాగాంధీని అడిగితే సవివరంగా చెప్తారని క్లారిటీ ఇచ్చారు రోజా. అదేవిధంగా.. 2019 ఎన్నికల్లో గెలిచిన తీరు చూస్తే జగన్ ధైర్యం ఏపాటిదో తెలుస్తుందని, జగన్ ధైర్యం గురించి చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అనంతరం మరింత ఫైరయిన రోజా… రాజీనామాలు చేసే ధైర్యం చంద్రబాబుకులేక, పిరికి పందలా జూమ్ యాప్ లో చిందులు తొక్కుతున్నారని.. చంద్రబాబు మైండ్ బ్లాక్ యై ఏమాట్లాడుతున్నారో తనకే తెలియకుండా మాట్లాడుతున్నారని రోజా విరుచుకు పడ్డారు. ఇక మూడు రాజధానులు పెడతామని తమ మేనిఫెస్టోలో పెట్టలేదని.. అయినంత మాత్రాన 2014 ఎన్నికల్లో అమరావతి రాజధాని చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిందా అంటూ రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఆయన కుమారుడు “పప్పు” మాత్రం ట్విట్టర్ కే పరిమితమౌతుండటం జాలేస్తుందని కూడా రోజా వ్యంగస్త్రాలు సంధించారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version