మహేశ్ ఫాన్స్ చొక్కాలు విప్పి డాన్స్ చేసే న్యూస్ !

-

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి కొత్త ఏడాదిలోనే మహేష్ బాబు కి అదరగొట్టే హిట్ ఖాతాలో పడింది. దీంతో మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగాయి.

అయితే వంశీ స్క్రిప్ట్ విషయంలో సెకండాఫ్ సరిగ్గా లేకపోవడంతో మహేష్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడం జరిగింది. అయితే ఈ వార్తల పై సోషల్ మీడియాలో మరి ఇండస్ట్రీలో రకరకాలుగా వార్తలు వచ్చినా మొత్తానికి మహేష్ మరియు వంశీ కాంబినేషన్ లో సినిమా లేదని చివరికి తేలింది. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమా గురించి అనేకమంది డైరెక్టర్ ల పేర్లు వినపడుతున్నాయి. అయితే తాజాగా మాత్రం ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ తో మహేష్ బాబు సినిమా కన్ఫామ్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.

 

అంతే కాకుండా ఈ సినిమా మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ స్క్రిప్టుతో తెరకెక్కిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి. వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన మహేష్ ఈసారి రొమాంటిక్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. దీంతో ఆల్ మోస్ట్ ఆల్ ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ తో మహేష్ సినిమా ఓకే చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో రావడంతో మహేష్ ఫ్యాన్స్ కి చొక్కాలు విప్పి డ్యాన్స్ వేసే న్యూస్ ఇది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version