విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఇదేమీ బుద్ది అని ప్రశ్నించిన మహిళా టీచర్లను వేధింపులకు గురిచేసిన కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అక్కడ ఫిజిక్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు గోపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
గత కొంతకాలంగా పాఠశాలలోని విద్యార్థినులతో వేణుగోపాల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులకు స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు.దీంతో తోటి మహిళా ఉపాధ్యాయులు అతన్ని నిలదీయగా.. వారిపైనా వేణుగోపాల్ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళా ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినిలు డీఈవోకు ఫిర్యాదు చేయగా.. వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి కీలకఆదేశాలు జారీ చేశారు.