సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై కీలక ప్రకటన చేసింది సుప్రీం కోర్టు. జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ కేసును ఇవాళ సుప్రీం కోర్టు విచారించింది. ఈ తరుణంలోనే… తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ఇది ఇలా ఉండగా… గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో సజ్జల భార్గవ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.