హరీష్‌తో ఖమ్మంలో కారు డ్యామేజ్ తగ్గుతుందా?

-

అసలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ బలం అంతంత  మాత్రమే..ఇలాంటి పరిస్తితుల్లో పలువురు నేతలు కారు పార్టీని వీడాలని అనుకుంటున్నారు..దీని వల్ల ఆ పార్టీకి ఇంకా నష్టమని చెప్పవచ్చు. అసలు గత రెండు ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటి అధికారంలోకి వచ్చింది..అయితే ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల్లోనే కారు పార్టీ సత్తా చాటగలిగింది. అసలు ఖమ్మంలో మంచి ఫలితాలు సాధించలేదు. గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే…కేవలం ఒక్క సీటు మాత్రమే కారు పార్టీ గెలుచుకుంది.

కాంగ్రెస్-టీడీపీ పొత్తులో 8 సీట్లు గెలుచుకున్నాయి. ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. అయితే అధికారంలోకి వచ్చాక ఖమ్మంలో నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కారు పార్టీ లాగేసుకుంది. అలా ఎమ్మెల్యేలని లాక్కుంది గాని క్షేత్ర స్థాయిలో మాత్రం బలపడినట్లు కనిపించలేదు. ఇదే సమయంలో ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..కారు దిగేసి కమలంలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఆయన పార్టీని వీడటం దాదాపు ఖరారైంది. అదే సమయంలో ఆయనతో పాటు కొందరు కీలక నేతలు సైతం కారు దిగేసేలా ఉన్నారు.

దీని వల్ల ఖమ్మంలో కారు పార్టీకి ఇంకా డ్యామేజ్ జరిగేలా ఉంది. అందుకే ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదట అసంతృప్తిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. తుమ్మల కూడా పార్టీ మారిపోతారనే ప్రచారం జరిగింది. అందుకే ముందు ఆయన్ని ఆపడానికి ట్రై చేసినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ ఉన్నాయి.

ఇక వాటిని సరిచేయడానికి కూడా హరీష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కానీ ఎంతవరకు హరీష్ ఖమ్మంలో పార్టీని లైన్ లో పెడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version