దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా : హరీశ్ రావు

-

కొండలు గుట్టలు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వమని అంటున్నారు. కొండల్లో, గుట్టలో దళిత గిరిజనులు భూములు సాగు చేస్తారు. అయితే ఈ దళితులు, గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదా అని ప్రశ్నించారు హరీశ్ రావు. అందరికి అన్నం పెట్టే రైతును అడుక్కుతినేలా చేయకండి 4 తేదీన క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసాపై చర్చిస్తారని తెలిసింది. ఒక వేళ ఒకే పంట పండించే భూముల రైతులకి రైతు భరోసా ఇవ్వకపోతే తస్మాత్ జాగ్రత్త. జరగబోయే పర్యవసాలకు మీరే బాధ్యత వహించాలి అన్నారు.

ఇక 2 లక్షలు పైన రుణాలు ఉన్న రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో సీఎం చెప్పాలి. సీఎం మాట నమ్మి 2 లక్షల పైన రుణం ఉన్న రైతులు అప్పు తెచ్చి కట్టి ఇంకా అప్పుల పాలయ్యాడు. 2 లక్షల లోపు ఉన్న సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 11 సార్లు కేసీఆర్ రైతుభందు ఇచ్చారు.. రైతుల సమాచారం మొత్తం ఉన్న మళ్లీ కొత్తగా అప్లికేషన్లు ఎందుకు. తెలంగాణలో 54 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉంటే ఒక కోటి 4 లక్షల మంది కూలిలు ఉన్నారు. దీంట్లో కూడా ఏరివేతలు మొదలుపెడుతుంది కాంగ్రెస్.. ఇది అన్యాయం అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version