డైవర్షన్ పాలిటిక్స్ కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారు : హరీష్ రావ్

-

తెలంగాణ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారు అని హరీష్ రావు అన్నారు. అలా డైవర్షన్ కోసమే లగచర్ల ఇష్యూ.. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇప్పుడు రైతు భరోసా ఇస్తాం అంటున్నారు. ఒక్కసారి ఇస్తారేమో.. కానీ, ఎన్నికల తర్వాత అసలు ఇవ్వరు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హామీలను ఆ ప్రభుత్వం నిలబెట్టుకుంది. అధికారంలోకి రాగానే మహిళలకు 4వేలు ఇస్తున్నారు.

ఇక్కడ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. ప్రశ్నించినందుకే కేటీఆర్ పై కేస్ లు పెట్టారు అప్పుల పై అడ్డగోలుగా మాట్లాడితే అసెంబ్లీ లో నిజాలు నిరూపించాం. ఇంకా మా పై తప్పుడు మాటలు మాట్లాడితే లీగల్ గా వెళ్తాము. లగచర్ల రైతుల కోసం, ఏ కార్యకర్తలకు ఆపద వచ్చినా కేటీఆర్ అండగా నిలబడ్డారు. ఇప్పుడు కేటీఆర్ మీద కేసు పెట్టినా పార్టీ క్యాడర్ అంతా అండగా ఉంటుంది అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news