కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన నియోజకవర్గంలోని వివిధ మండలాల మహిళలకి మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత కుట్లు మిషన్ పంపిణి చూశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తుందని ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. గత ఎండాకాలంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ నీటితో చెరువులు కుంటలు, చెక్ డాంలు నింపుకొని పంటలు ఎండిపోకుండా కాపాడుకుంటున్నట్లు గుర్తు చేశారు.
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయమే ప్రధాన ఎజెండా కాలేశ్వరం ప్రాజెక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తూ నీళ్లు విడుదల విడవడం లేదని చెప్పారు. సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు హరీష్ రావు రాష్ట్రమంతా నీళ్లు లేక బోర్లు ఎండిపోతున్నాయన్నారు.