కాంగ్రెస్లో అబద్దాల పోటీ నడుస్తోందని హరీష్ రావు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నూరు అబద్దాలతో సమానమని మరోసారి రుజువు అయిందన్నారు. అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని అన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అభాసుపాలైన భట్టి రుణమాఫీ పై కూడా నాలుక మడత పెడుతున్నారని అన్నారు.
రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులని ఘోరంగా వంచించడమేనని అన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు మొదటి సంతకం రుణమాఫీ మీద చేశారని చెప్పిన విషయం భట్టికి తెలియనట్టు నటించడం హాస్యపదం అని అన్నారు హరీష్ రావు.