బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వస్తానని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భరోసాని ఇచ్చారు. మంగళవారం హరీష్ రావు షాద్‌నగర్ నియోజకవర్గం లో ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో షాద్‌నగర్ ప్రజల పోరాట స్ఫూర్తిని చూపించారని కొనియాడారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని అన్నారు గెలిచాక చేతులెత్తేసింది అని అన్నారు. స్వల్ప మెజారిటీ తో షాద్‌నగర్ లో ఓడిపోయామని అన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్‌ని వదిలిపెట్టమని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.