కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. వరి ధాన్యం కొనమంటే కేంద్రం కొనదు.. ఎమ్మెల్యేలను మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా కొంటుంది.. ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు రూ.100 కోట్లు పెట్టడానికైనా వెనుకాడలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు హరీష్‌రావు.
సిద్దిపేట జిల్లా నంగునూర్ (మం) సిద్దన్నపెట లో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో కల్యాణ లక్ష్మీ పథకం ఎక్కడ కూడా లేదని.. గతంలో డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళేవారు కాదు నేడు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు మెరుగుపరిచామన్నారు. డెలివరీ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని.. మొదటి గంట తల్లిపాలు బిడ్డకు అమృతం తో సమానమని చెప్పారు. డెలివరీ కోసం ముహూర్తాలు పెట్టుకుంటే మీ ప్రాణాలకు ముప్పన్నారు హరీష్‌రావు.