బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని… ప్రజల టీమ్ : హరీశ్ రావు

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రజలను తమవైపుకు ఆకర్షించేందుకు వరాలు జల్లులు కురిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… ఆనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని నోటికి వచ్చినట్లు తిట్టిన టీపీసీసీ చీఫ్, ఇప్పుడు ఆమెనే దేవత అంటున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదని, తమది తెలంగాణ ప్రజల టీమ్ అన్నారు. మంగళవారం డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఓటుకు నోటు, నోటుకు సీటు అనే వాళ్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దొంగకు తాళం చెవులు అప్పగించిందని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య పోటీ ఉంటుందన్నారు. సంగారెడ్డిలో కచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగారేస్తామాని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version