BREAKING: పెళ్లి పీటలు ఎక్కనున్న వెంకటేష్ కుమార్తె.. !

-

టాలీవుడ్ అగ్రహీరోలతో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇంట్లో శుభకార్యానికి తెరలేచింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వెంకటేష్ మరియు నీరజల రెండవ కుమార్తెకు నిశ్చితార్థం జరగనుందట. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన వారు కూర్చుని మాట్లాడుకుని వివాహాన్ని నిశ్చయించుకున్నారట. వెంకటేష్ రెండవ కుమార్తె హయవాహినిని విజయవాడకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్ కుటుంబానికి కోడలుగా పంపనున్నారు. రేపు విజయవాడ లో నిశ్చితార్థం జరగనుంది, ఇప్పటికే ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబం విజయవాడకు చేరుకున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే వెంకటేష్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. కాగా వెంకటేష్ మరియు నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక కొడుకు సంతానంగా ఉండగా, ఇప్పటికే పెద్దమ్మాయికి నాలుగు సంవత్సరాల క్రితమే పెళ్లి చేసారు. ఇక మిగిలిన వారిలో రెండవ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి సెట్ అయింది.

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే డాక్టర్ శైలేశు కొలను డైరెక్షన్ లో ఒక మెడికల్ మాఫియా కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version