వచ్చే నెల నుంచి 57 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ : హరీష్ రావు

-

వచ్చే నెల నుంచి 57 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క అర్హులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో పల్లె ప్రకృతి వనం, ఉన్నత పాఠశాల అదనపు తరగతులను ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హారీష్‌ రావు మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే సరిపోదని… గ్రామాలలో వచ్చి చూస్తే అభివృద్ధి ఏమిటో వాళ్ల ముఖాలకు తెలుస్తుందని ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్ ఉండేవని మండిపడ్డా హరీష్‌… ఇప్పుడు కాళేశ్వరం నీళ్లతో నిండు కుండల తెలంగాణ తయారైందని పేర్కొన్నారు. త్వరలోనే రుణ మాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

మండుతున్న ఎండల్లో కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చి కొత్త నడక నేర్పిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు. టీఆర్ ఎస్ హయాంలో తెలంగాణ రైతాంగానికి భరోసా లభించిందని తెలిపారు. కరెంట్ లేకుండా కాలువల నీటి ద్వారా పొలాలను పండించుకునే సమయం ఆసన్నమైందన్నారు. మరో రెండు నెలల్లో మల్లన్న సాగర్ లో నీళ్లు వచ్చి చేరతాయని వెల్లడించారు మంత్రి హరీష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version