ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావు సంచలన కామెంట్లు చేస్తుంటాడు. అందులో భాగంగానే ఈ సారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లపై తన మాటాల బాణాలను వదిలాడు. తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీలు బలపడుతుండడంతో ఆ పార్టీలోను దెబ్బతీసేందుకు టీఆర్ ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేయడం వల్లే వీరికి పదవులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడడంతోనే టీకాంగ్రెస్, టీ బీజేపీలు ఏర్పడ్డాయని అందువల్లే వీరు అధ్యక్షులయ్యారని వివరించారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఏర్పడకపోయి ఉంటే రేవంత్‌రెడ్డికి పదవి వచ్చి ఉండేదా అని ప్రశ్నించారు. లేకుంటే రేవంత్‌రెడ్డి ఎక్కడుండే వారని ప్రశ్నించారు.
బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవి రావడం కేసీఆర్ పోరాటమేనని లేకుంటే తెలంగాణాలో బీజేపీ ఎక్కడుండేదని అడిగారు. అయితే ఈ మాటల వెనుక అర్థం వేరే ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణా కోసం పోరాటం చేసింది కేసీఆరేనని, టీఆర్ఎస్సేనని ప్రజలకు గుర్తుచేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చర్చ నడుస్తోంది. ఈ మాటల వల్ల అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు పార్టీలు ఇరుకున పడ్డాయి. దీనిపై రెండు పార్టీల లీడర్లు ఎటువంటి కౌంటర్లు వేస్తారో చూడాలి. అయితే ఇది వరకే దీనిపై కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణ తల్లిగా సోనియా అంటూ నినాదాలు చేశారు. మరో వైపు బీజేపీ కూడా అప్పట్లోనే కౌంటర్ లు వేసింది. పార్లమెంట్‌లో బీజేపీ నాయకులు పోరాటం చేశారని వివరించే ప్రయత్నం చేశారు. తాము మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ బిల్లు పాసయ్యిందని చెప్పారు.