Pawan Kalyan: పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ డిస్కషన్స్..డీఓపీతో హరీశ్ శంకర్

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్- సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలై పదేళ్లు అయింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ పిక్చర్ చూసి జనం ఫిదా అయిపోయారు. కాగా, ప్రస్తుతం ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నది. అదే ‘భవదీయుడు భగత్ సింగ్’. తాజాగా ట్వి్ట్టర్ వేదికగా ఈ పిక్చర్ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు హరీశ్.

అయనంక బోస్ ‘భవదీయుడు భగత్ సింగ్ ’చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడన్న విషయం స్పష్టం చేశారు. సినిమా గురించి అద్భుతమైన చర్చ జరిగిందని, త్వరలో సెట్స్ లోకి వెళ్లబోతున్నట్లు తెలిపాడు హరీశ్. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ కు థాంక్స్ చెప్పాడు. తన చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నాడు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ ను మించి ఉండబోతున్నదని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సారి ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాకుండా సొసైటీకి మెసేజ్ ఇచ్చేందుకు దర్శకుడు హరీశ్ శంకర్ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version