జూపల్లి కృష్ణారావు పచ్చి రాజకీయ అవకాశవాది – కొల్లాపూర్ ఎమ్మెల్యే

-

జూపల్లి కృష్ణారావు పై కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. జూపల్లి కృష్ణారావు పచ్చి రాజకీయ అవకాశవాది అని.. కొల్లాపూర్ నియోజక వర్గంలో అక్రమ కేసులు పెట్టలేదని నిప్పులు చెరిగారు. జూపల్లి చెబుతున్న కేసులపై ఎటువంటి విచారణకైనా నేను సిద్ధమని సవాల్‌ చేశారు. జూపల్లి కృష్ణారావు వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చింది… కొల్లాపూర్ నియోజక వర్గానికి కృష్ణారావు చేసింది ఏమీ లేదన్నారు. అక్రమ కేసులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు…. కొల్లాపూర్ లో ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు అని వివరించారు. జూపల్లి కృష్ణారావు నిజస్వరూపం ఏంటో కొల్లాపూర్ ప్రజలకు తెలుసు అన్నారు. కొల్లాపూర్ ప్రజలు 2018లో జూపల్లినీ ఓడించిన బుద్ధి రాలేదని విమర్శలు చేశారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version