భారత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అలిగడ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్ధులపై జరిగిన దాడుల విషయం అందరికి తెలిసిందే. ఈ దాడుల నేపధ్యంలో ప్రపంచం లోని అన్ని యూనివర్సిటీల విద్యార్ధులు వారి వ్యతిరేకతను తెలియచేశారు. ఒక్కొ యూనివర్సిటీ విద్యార్ధులు ఒక్కో విధంగా తమ నిరసనలను వినిపించారు…
ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన పలు యూనివర్సిటీ ల విద్యార్ధులు సైతం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసన తెలిపారు. సుమారు 400 మంది విద్యార్ధులు నిరసనలు తెలుపుతూ సంతకాలు చేసిన ప్రతిని విడుదల చేశారు. అంతేకాదు లండన్ లోని ఆక్స్‌ఫర్డ్ విద్యార్ధులు కూడా తన నిరసనలు తెలియచేస్తూ భారత ప్రభుత్వానికి బహిరంగ లేఖని రాశారు.
తాము విద్య నేర్చుకోవడానికి వచ్చామని ఇలా తోటి విద్యార్ధులపై దాడులు చూస్తూ సహించలేక పోతున్నామని వాపోయారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్ధులు కూడా ఈ దాడులపై నిరసనలు తెలుపుతూ మౌన ప్రదర్శన చేశారు. ఫిన్ ల్యాండ్ కి చెందిన భారతీయ విద్యార్ధులు భారత రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు.