ఇంజినీరింగ్ జాబ్స్ వ‌దిలి బిర్యాని బండి.. లక్షల్లో లాభాలు..!

-

ఈ మధ్య చాలా మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులను సంపాదించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఉద్యోగం చేయడం చాలా మందికి నచ్చడం లేదు. అందుకనే స్వయంగా ఎవరికి వారే వ్యాపారాలను మొదలు పెట్టుకుంటున్నారు. అదే విధంగా ఇద్దరు ఇంజనీర్లు కూడా ఉద్యోగాన్ని వదిలేసి బిర్యాని సెంటర్ ని మొదలు పెట్టారు.

 

బిర్యాని సెంటర్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… హర్యానాలోని సోనిపట్ కు చెందిన రోహిత్, సచిన్ ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఒకే కంపెనీలో పని చేసేవారు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం చేయడం వాళ్ళకి నచ్చలేదు. లక్షల్లో జీతాలు కాదనుకుని సొంతంగా చిన్న బిర్యాని సెంటర్ ని మొదలు పెట్టారు.

వీరి ఐడియా బాగానే వర్కౌట్ అయింది. ఆ బిర్యాని సెంటర్ కి ఇంజినీర్స్ వెజ్ బిర్యానీ అనే పేరు పెట్టారు. మరొక దాని పేరు ఆచారి వెజ్ బిర్యాని అని పెట్టారు. ఏ బిర్యానీ అయినా అర ప్లేట్ 50 రూపాయలు ఫుల్ ప్లేట్ 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంతో రుచికరంగా బిర్యానీ అందిస్తున్నారు. ఇద్దరూ కూడా చేతులు నిండా డబ్బులు సంపాదిస్తున్నారు.

జాబ్ కంటే కూడా ఎక్కువగా డబ్బులు ఇప్పుడు వస్తున్నాయని వాళ్లు తెలిపారు. నిజానికి మనం అనుకున్నది తెలివిగా సంపాదించుకుంటే ఈ రోజుల్లో సక్సెస్ అవ్వొచ్చు. అంతేకానీ మనలో మనం కుంగిపోయి ఉద్యోగం రాలేదని బాధపడే దానికంటే వచ్చిన మంచి ఆలోచనలతో ఇలాంటివి మొదలుపెట్టి చక్కగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పైగా ఈ రోజుల్లో ఇలా వ్యాపారం చేసుకోవడం వల్ల కూడా చాలామంది చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా నచ్చిన మార్గంలో వెళ్ళండి. తప్పకుండా సక్సెస్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version