కేరళలో ఒక వింత జరిగింది. ఒక మనిషి నాలుక ఏకంగా నలుపు రంగు లోకి మారిపోయింది. అయితే ఆ వ్యక్తి కేవలం సాఫ్ట్ గా ఉండే ఆహార పదార్థాలను మరియు లిక్విడ్స్ ను మాత్రమే తీసుకున్నారు. అయితే ఇక అసలు ఇంతకీ ఏమైంది అనేది చూస్తే.. దీనిని లింగువ విలోస నిగ్ర అని అంటారు. మూడు నెలల క్రితం హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఈ వ్యక్తికి.
ఆ తర్వాత ఎడమ పక్క పెరాల్సిస్ వచ్చింది. దీంతో మూడు నెలల పాటు అతనికి కేవలం సాఫ్ట్ గా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే ఇచ్చారు. అలానే ఫ్లూయిడ్స్ ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నాలుక నలుపు రంగులోకి మారిపోయింది. పైగా కార్పెట్ మాదిరి జుట్టు నాలుక మీద మొలవడం మొదలుపెట్టింది. అయితే ఇది బ్యాక్టీరియా లేదా పొగాకు కానీ ఇతర ఆహార పదార్థాల వల్ల కానీ వచ్చి ఉండొచ్చు అని అంటున్నారు డాక్టర్లు.
ఓరల్ హైజీన్ లేక పోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యాంటీబయాటిక్స్ కారణంగా కూడా రావచ్చు. అయితే ఇది చాలా సాధారణంగా వస్తుందని… 13 శాతం మంది ఇలాంటి సమస్యతో సతమతమవుతూ ఉంటారని వైద్యులు అంటున్నారు.