ఆ సినిమాతో కరణ్ జోహార్ అన్ని కోట్లు నష్టపోయారా..?

-

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కరణ్ జోహార్ ఎన్నో చిత్రాలను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఎక్కువగా కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ హీరో హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. అందుకే ఒక నిర్మాతగా కూడా మారి ఎన్నో సినిమాలను నిర్మించి సుమారుగా రూ.1650 కోట్ల ప్రాపర్టీకి అధినేతగా నిలిచారు.

ఇకపోతే తాజాగా ఈయన నిర్మించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు కరణ్ జోహార్.. అలియా భట్ హీరోయిన్ గా , రణ్ బీర్ కపూర్ హీరోగా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కరణ్ జోహార్ మాట్లాడుతూ 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది అని కూడా తెలిపారు.

కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని తెలిపారు. ఇకపోతే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ లతో మరో మూడు చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలపడం జరిగింది. అయితే మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్ తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్ర నిర్మాతగా వెల్లడించారు కరణ్ జోహార్.

Read more RELATED
Recommended to you

Latest news