నాకు వైరల్‌ ఫీవర్‌ .. విచారణకు హాజరుకాలేను: సినీ నటి హేమ

-

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ నిందితులను పోలీసులు విచారించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీ నటి హేమ తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని చెప్పారు. తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, అందువల్ల విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం.

రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా సోమవారం విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోనట్లు సమాచారం. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

మరోవైపు నటి హేమ సోమవారం ఉదయం సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘మనం తప్పు చేయనంతవరకూ ఎదుటివాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుళ్లం కాదు కదా! పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు.’ అని హేమ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news