ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో జరిగిన అత్యాచారం హత్య ఘటనపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ చేస్తున్న హడావిడి పై ఒక వైపు విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అనవసరంగా అత్యాచారం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ కి ఏకంగా హత్రాస్ గ్రామ ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
హత్రాస్ బాధిత కుటుంబాన్ని ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు హత్రాస్ గ్రామ ప్రజలు. ప్రస్తుతం హత్రాస్ అత్యాచారం హత్య ఘటన విషయంలో కాంగ్రెస్ నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తోంది సరే… మరి రాజస్థాన్లో పూజారి హత్య జరిగినప్పుడు ఇలాంటి ర్యాలీలు నిరసనలు ఎందుకు చేయలేదు అంటూ ప్రశ్నించారు. దీనిపై తమకు తప్పక సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు హత్రాస్ గ్రామ ప్రజలకు.