ఈ నెల 12 న బహుజన బతుకమ్మ పాట, ఆడపిల్లలను బ్రతకనిద్దాం: విమలక్క

-

బహుజన బతుకమ్మను ఉత్సవంలా కాదు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళుదాం రుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారధి విమలక్క అన్నారు. కోవిడ్ వల్ల చనిపోయిన వారికి బహుజన బతుకమ్మ తరపున నివాళులు అని ఆమె పేర్కొన్నారు. కోవీద్ నేపథ్యంలో వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలను జనసందోహం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ జర్పుకోవాలని కోరారు.

బహుజన బతుకమ్మను ఊరంతా జర్పుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచార ఘటనలు దుర్మార్గమైనవని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. హత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆడపిల్లలను బ్రతకనిద్దామని అన్నారు. ఈ నెల 12 నా బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. ఈ నెల 16 నుండి 24 వరకు బహుజన బతుకమ్మ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని కోరారు

Read more RELATED
Recommended to you

Exit mobile version