నిద్రమాత్రలు వాడే అలవాటు ఉందా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

-

నైట్ నిద్ర రావడం లేదని.. ఈ మధ్య చాలామంది.. నిద్రమాత్రలకు అలవాటు పడుతున్నారు. వీటివల్ల ప్రశాంతమైన నిద్ర దొరుకుతుందేమో కానీ ఆరోగ్యానికి ఇవి ఏమాత్రం మంచివి కావు. ఈ విషయం తెలిసి కూడా.. చాలా మంది వీటికి బానిసలవుతున్నారు. ఈరోజు మీకు తెలియని దుష్ప్రభావాల గురించి చూద్దాం.
నిద్రమాత్రలు ఎక్కువగా వాడటం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలు, తలనొప్పి, గుండెలో మంట, కడుపునొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం.. జరుగుతుంది.
కొంతమందిలో నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల అలర్జీ సంబంధిత చర్మ సమస్యలు కూడా వస్తాయట. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చినప్పుడు కూడా.. ఇలాంటి సందర్భాల్లో నిద్రమాత్రలు మానేసి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
వాంతులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్లు మసకగా కనిపించడం, దురద, ఛాతీలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం.. మొదలైన దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయి.
ఏదైనా అలవాటైతే మానుకోవడం చాలా కష్టం. నిద్రమాత్రలకు బానిస ‌అవడం కూడా ఒక చెడు అలవాటు లాంటిదే.. అలాగే ఒక్కసారి నిద్రమాత్రలు వేసుకోవడం మొదలు పెట్టారంటే.. మీ ఆరోగ్యం చేయి జారినట్లే. చాలా కాలం కొనసాగించారంటే ఇక అంతే సంగతులు. నిద్ర పట్టడం లేదని మాత్రలు వేసుకొని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం కంటే ఒక్కసారి మీకు ఎందుకు నిద్ర పట్టడం లేదో డాక్టర్‌కు వివరంగా అడిగితే..చక్కటి సలహా సూచిస్తారు.
కొంతమంది డాక్టర్ సలహా మేరకు నిద్ర మాత్రలు వాడుతుంటారు. అలాంటివారు.. డాక్టర్ చెప్తేనే కదా..వాడుతున్నాం.. ఏం కాదులో అనుకుంటారు.. కానీ ఇది దీర్ఘకాలంగా కొనసాగితే వాటికే అలవాటు పడే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ వాడుతుంటే కొన్ని రోజులకు ఈ మాత్రల మోతాదు శరీరానికి సరిపోదు. డోస్ పెంచాలి.. అలా పెంచితే రోగాలు ఇంకా పెరుగుతాయి. నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియలో భాగంగా ఒత్తిడి ఏర్పడి కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి డాక్టర్ సలహా మేరకే నిద్ర మాత్రలు వాడినా వారు చెప్పిన జాగ్రత్తలు పాటించాలనే విషయం మాత్రం మర్చిపోకండే..

ఇలా అస్సలు వాడొద్దు..

గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి నిద్ర పట్టదు. ఇలాంటి సమయాల్లో నిద్రమాత్రలు వేసుకోవడం అస్సలు మంచిది కాదు.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వేసుకోకూడదు.
అలాగే నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేయకూడదు.
ఏ పానీయంలోనైనా నిద్ర మాత్రల్ని కలుపుకొని తాగకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version