హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కంచ గచ్చిబౌలి భూములపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదన్నారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటుండ్రా! అని ప్రశ్నించారు. స్కాంలో కేటీఆర్ చెప్పిన ఆ బీజేపీ ఎంపీ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలు చేసినప్పుడు వారి పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేవా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు.ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు సీఎం మార్పుపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. అది వారి అవివేకానికి పరాకాష్ట అని సీరియస్ అయ్యారు.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్చిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని..ఒకవేళ సీఎం మార్పే ఉంటే ఆవిడే ఎన్నడో ప్రకటన చేసేవారన్నారు.