ట్రెండ్ ఇన్: పన్నెండో మనిషిగా మోహన్ లాల్..సత్తా చాటుతున్న సంపూర్ణ నటుడు

-

మాలీవుడ్(మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. సంపూర్ణ నటుడిగా పేరు గాంచిన ఈయన్ను మలయాళీలు ‘లాలెట్టాన్, లాలెట్టా’ అని పిలుస్తుంటారు. ఆరు పదుల వయసు దాటిన ఈ నటుడు తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఇండియన్ సినిమా రంగంలో ఏర్పరుచుకున్నాడు.

మలయాళం భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో ‘గాండీవం, జనతా గ్యారేజ్, మనం’ సినిమాల్లో నటించిన మోహన్ లాల్..తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్నాడు. 21 మే .. ఈ రోజు (శనివారం) ఆయన బర్త్ డే. కాగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఈ క్రమంలోనే హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ అనే హ్యాష్ ట్యాగ్ పేరిట మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు. అలా అభిమానుల వరుస ట్వీట్లతో #HBDMohanlal హ్యాష్ ట్యాగ్ హెచ్ బీడీ మోహన్ లాల్..ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ హ్యాష్ ట్యాగ్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ OTT ఒరిజినల్ ట్వెల్త్ మ్యాన్ పదం కూడా ట్వీట్ చేస్తున్నారు. అలా హ్యాష్ ట్యాగ్ #12thMan కూడా ట్రెండవుతోంది. 12thMan ఫిల్మ్ ఈ నెల 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమవుతోంది.

జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉందని ప్రశంసిస్తున్నారు. థ్రిల్లర్ ఫిల్మ్స్ కు కేరాఫ్ గా ఉండే జీతు జోసెఫ్..మోహన్ లాల్ మరోసారి ఇరగదీశారని అంటున్నారు. 62 ఏళ్ల వయసులోనూ మోహన్ లాల్..ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరాజ్’ ఫిల్మ్ గురించి త్వరలో అప్ డేట్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయి. మోహన్ లాల్ నట వారసుడిగా ఆయన తనయుడు ప్రణవ మోహన్ లాల్..ఇటీవల ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి చిత్రం‘హృదయం’తోనే సక్సస్ అందుకున్నాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరి తో ప్రేక్షకుల మెప్పు పొందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version