నాన్నను మిస్సవుతున్నా : రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్

-

ట్విట్టర్ లో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. మా నాన్నను మిస్సవుతున్నా అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మా నాన్న దూరదృష్టి గల నాయకుడు, ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయని తెలిపారు. అతను కరుణ మరియు దయగల వ్యక్తి మరియు నాకు మరియు ప్రియాంకకు అద్భుతమైన తండ్రి, క్షమాపణ మరియు సానుభూతి యొక్క విలువను మాకు నేర్పించారని వెల్లడించారు రాహుల్‌.

నేను అతనిని చాలా మిస్ అవుతున్నాను మరియు మేము కలిసి గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తుంచుకుంటానని స్పష్టం చేశారు. కాగా.. స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్దంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి తో పాటు ముఖ్య నాయకులు ఉదయం 9 గంటలకు సోమజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉదయం 10 గంటలకు స్వర్గీయ ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట కు బయలుదేరుతారు. మద్యాహ్నం 1 గంటకు అక్కంపేట గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version