హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలిలో గల 400 ఎకరాలు ఖచ్చితంగా అటవీ శాఖకు చెందుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ..గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అటవి లక్షణాలు ఉంటే ప్రైవేట్, ప్రభుత్వ భూమి అయిన ఫారెస్టుకే చెందుతుందన్నారు.
1996లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అడవికి ఉండే 0.4 క్యానపి లక్షణాలు ఉంటే అది ఎవరి భూమి అయినా అటవీ భూమి అవుద్దని.. అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు సందర్బంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులు, ప్రభుత్వాలు ఆదేశాలు కూడా వచ్చాయని.. అలాంటి భూమి ఎక్కడున్నా గుర్తించాలని ఆ ఆదేశాల్లో ఉన్నాయని.. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకోసం కమిటీని ఏర్పాటు చేసిందని ఈ సందర్బంగా కేటీఆర్ గుర్తుచేశారు. కాగా, సుప్రీంకోర్టు కమిటీ నిన్న హెచ్‌సీయూలో పర్యటించి అధికారులతో సమావేశమైన విషయం తెలిసిందే.