బ్రాండింగ్ గుర్తింపు పొందిన హెచ్ డీఎఫ్ సీ.. వరుసగా ఏడో సారి..!

-

ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ బ్యాంకు భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్లలో తమకు మొదటి ర్యాంక్‌ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన విషయాలను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తెలియజేసింది. ఇక వరుసగా ఏడో ఏడాది తమకు ఈ గుర్తింపు లభించినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ యాజమాన్యం వెల్లడించింది.

hdfc

అయితే 2020 బ్రాండ్జ్‌ టాప్‌ 75 మోస్ట్‌ వాల్యూబల్‌ ఇండియన్‌ బ్రాండ్స్‌’ అధ్యయనం చేశారు. ఇక అందులో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ బ్రాండ్‌ విలువ 20.3 బిలియన్‌ (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు)డాలర్లుగా ఉన్నట్లు తెలియజేసింది. అంతేకాదు 2014లో 9.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే తమ ఆర్ధిక ప్రదర్శన, వినియోగదారుల అనుభవాల పరంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ స్థిరంగా ఉందని తెలిపారు. దీంతో పాటుగా 2020 బ్రాండ్జ్‌ టాప్‌ 100 మోస్ట్‌ వాల్యూబల్‌ గ్లోబల్‌ బ్రాండ్స్‌ అధ్యయనంలో అత్యున్నత 100 అంతర్జాతీయ బ్రాండ్ల జాబితాలో అమెజాన్‌ అగ్రస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 59వ ర్యాంక్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇక టాప్‌10లో ఉన్న ఇతర బ్రాండ్లలో యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గుగూల్‌, వీసా, అలీబాబా, టెన్సెంట్‌, ఫేస్‌బుక్‌, మెక్‌డొనాల్డ్స్‌, మాస్టర్‌ కార్డులు వరుసగా ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version