BREAKING : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌..ఏప్రిల్ 15వ తేదీకల్లా దర్యాప్తు పూర్తి !

-

BREAKING : వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసు కుంది. సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎం ఆర్ షా. తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సిబిఐ. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సూచించింది సిబిఐ. రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎం ఆర్ షా.

దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదన్నారు న్యాయమూర్తి ఎం ఆర్ షా. విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని కోరింది తులశమ్మ.ఆ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీం ధర్మాసనం… మధ్యాహ్నం 2గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని పేర్కొంది సిబిఐ. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తెలిపారు తులశమ్మ తరపు న్యాయవాది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version