ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు

-

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ,పంజాబ్, ఢిల్లీకి చెందిన క్రీడాకారులు పవన్‌ను కలిశారు.తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు.

క్రీడలతో సంబంధం లేని వారికి క్రీడా సంఘాలు అందించొద్దని వినతి పత్రాన్ని అందించారు. కొన్ని క్రీడా సంఘాలు రాజకీయ ఉపాధి ఆవాస కేంద్రాలుగా మారిపోయాయని వారు వాపోయారు. క్రీడాకారులకు ఇచ్చే సర్టిఫికేట్లు అంగడి సరుకుగా మారిపోయాయని ,ఎటువంటి క్రీడానుభవం లేనివారు క్రీడాకారుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారని ఆయన దృష్టికి క్రీడాకారులు తెచ్చారు. క్రీడా సంఘాలలో తిష్టవేసిన రాజకీయ నేతల వల్ల క్రీడాకారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ,తమ బంధువులు, సన్నిహితుల పిల్లలను కొందరు రాజకీయ నేతలు అధికార దర్పంతో ఎంపిక చేయిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీలయ్యాయని మండిపడ్డారు.గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీలోని అన్ని రంగాలూ అధోగతి పాలయ్యాయని ఆయన విమర్శించారు. ఏపీలో క్రీడారంగం కూడా అస్తవ్యస్తంగా మారిందని,రాష్ట్రంలో దారి తప్పిన వ్యవస్థలను దారిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను ప్రయత్నిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version