చేప నూనెతో గుండె పదిలం.. ఇంకా ఈ రోగాలకు దివ్యఔషదమే..!

-

ఇది మృగశిర కార్తి.. ఈ టైంలో చేపలు తినాలని మన పెద్దోళ్లు చెప్తుంటారు. వాళ్లు ఎందుకు చెప్తారో వేరే విషయం.. చేపలు తినడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒమేగా 3 కొవ్వులు చేపలు తినడం వల్ల బాడీకీ అందుతాయి. ఇంకా వీటితో పాటు..విటమిన్‌ ఏ, డీ లు కూడా చేపల వల్ల పొందవచ్చు.అయితే అందరికీ చేపలు వల్ల లాభాలు తెలుసుకానీ..చేప నూనె వల్ల వచ్చే ఉపయోగాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. చేప నూనె అంటే.. చేపలను డీఫ్రై చేసినప్పుడు వచ్చే ఆయిల్‌ అనుకునేరు..! చేపల నుంచి ఆయిల్‌ తీస్తారు..సాల్లొన్, డాల్ఫిన్, గుండుమీను వంటి చేప రకాల నుండి తీసే చేపనూనెలో ఓమేగా అమ్లాలు అధికమోతాదులో ఉంటాయి. అనేక ఔషదాల తయారీలో ఈ నూనెను వాడతారు.. సప్లిమెంట్లను తయారు చేస్తారట.!. ఈరోజు చేప నూనె వల్ల ఉన్న లాభాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..!

చేపనూనె వల్ల లాభాలు..

చేపనూనె శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని పెంచటానికి ఎంతగానో తోడ్పడుతుంది.
చేప నూనెలో ఉండే ఈపీఏ, డిహెచ్ ఎ అనే రెండు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపర్చటంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి.
ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది..
చిన్నారుల్లో అటెంషన్ డెపిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలను తగ్గించటంలో చేప నూనెలోని డీహెచ్ ఎ సప్లిమెంట్ తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
గుండె పోటు మరణాలు నేడు ఎక్కువగా ఉన్నాయి.. గుండె జబ్బులు దరి చేరకుండా , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేపల నూనె అద్భుతంగా పనిచేస్తుంది.
చేపనూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.
అధిక రక్తపోటును తగ్గించటంతోపాటు, మానసిక ఒత్తిడి నుండి గుండెను కాపాడుతుంది.
వాపు నిరోధకంగా, గాయాలను తగ్గించటానికి చేపనూనె సహాయపడుతుందని పరిశోధకలు చెబుతున్నారు.
గుండె సంబంధిత వ్యాధులు తగ్గించుకోవాలనుకుంటే వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవటం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version