సాధారణంగా మనం రోజూ ఏవేవో తింటూ ఉంటాం. కొందరు పిజ్జాలు, బర్గర్లు అంటూ తెగ నమిలేస్తుంటారు. సరే ఎవరి ఆనందం వారిది. మరి ఇవి తింటున్నారు సరేగాని.. ప్రతిరోజూ గుడ్డు తింటున్నారా..? ఎందుకుంటే గుడ్డును ఉడికించినా లేదంటే ఆమ్లెట్ వేసినా అందులోకి యాంటీఆక్సిడెంట్స్ మాత్రం తగ్గిపోతాయి. అయినా యాపిల్ తింటే ఎంత శక్తి వస్తుందో గుడ్ల ద్వారా కూడా అంత ఎనర్జీ రావడం కాస్త విశేషమే కదా. యాంటీఆక్సిడెంట్లు గుండెజబ్బు, క్యాన్సర్ వంటి వాటి బారినపడకుండా కాపాడతాయి. ప్రతిరోజు కోడి గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. వారానికి అయిదు సార్లు గుడ్డు తిన్నా గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
రోజూ కోడి గుడ్డు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గుడ్డు తినని వారి కంటే తినేవారిలో గుండెపోటు ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్లు, గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఓ కోడి గుడ్డు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.