టమాటా వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలుసా…!

-

టమాట తో మనం ప్రతి రోజు ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాం. చాలా కామన్ గా తిని మనం అనేక వంటల్లో వాడతాము. టమాటా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లభిస్తాయి. అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టమాటాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ కె, కాల్షియం ఎముకలు సరి చేయడానికి బలంగా ఉంచడానికి సహాయ పడతాయి.

టమాటాలు సహజ క్యాన్సర్ ఫైటర్. టమోటాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి కూడా టమాటాలు ఉపయోగ పడతాయి. అలానే ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిని మెరుగు పరుస్తుంది. పైగా రేచీకటి నివారణ కూడా టమాటాలు బాగా ఉపయోగ పడతాయి. తీవ్రమైన, తిరిగి తీసుకురాని కంటి స్థితిని, దృష్టి లోపాన్ని కూడా ఇది ఉపయోగ పడుతుంది. మూత్ర పిండాల్లో రాళ్ళు, పిత్తాశయం లో రాళ్లను నివారించడానికి కూడా టమాటాలు సహాయ పడతాయి.

దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తాయి. తక్కువ నుంచి ఒక మోస్తరు దీర్ఘకాలిక నొప్పుల తో బాధ పడే వాళ్ళు టమాటాలు తీసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగ పడతాయి. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఇవి బాగా ఉపయోగ పడతాయి. టమాటా లో ఉండే విటమిన్ ఏ జుట్టు గట్టిగా ఉండేలా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. దీనిలో వుండే బీటా కెరోటిన్ చర్మాన్ని రక్షించడానికి సహాయ పడుతుంది. చర్మం పై ముడతలు, గీతలు లాంటివి కూడా ఇది తొలగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version