సీఎం జగన్ కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జగన్‌తో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఈ సందర్భంగా సీఎం మంత్రికి తెలిపారు. రోజుకు 22వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామన్నారు. ప్రస్తుతం 1.17%గా ఉన్న మరణాల రేటును 1% కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
కేసులు అధికంగా నమోదు అవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యమంత్రులతో హర్షవర్ధన్ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ తో బుధవారం మాట్లాడారు. ఇంతకుముందు ఆయన కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. ఇకపోతే కరోనాపై పోరుకు రూ. 179 కోట్లు కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు హర్షవర్ధన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.