ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో కొవిడ్ సేవలను అందించేందుకు నిర్ణయించింది. అలాగే భక్తులు ఆశ్రయం పొందేందుకు ఉద్దేశించిన తిరుపతిలోని విష్ణు నివాసాన్ని సైతం కొవిడ్ కేర్ సెంటర్‍గా మార్చేందుకు టీటీడీ ఆమోదం తెలిపింది.
చిత్తూరు జిల్లాలో నిన్న ఒక్కరోజే 224 కేసులు నమోదు అయ్యాయి. అందులో కేవలం తిరుపతిలోనే 135 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 13 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 28 మంది మృత్యువాత పడిన నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఏపీలో కొత్తగా 2,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 44 మంది మరణించారు.