ఏపీ : నేటి నుండి ఇంటింటి ఫీవర్ సర్వే…!

-

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో రాష్ట్రం ప్రభుత్వాలు కరోనా ను అరికట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

వారంలో ఐదు రోజుల పాటు ఫీవర్ సర్వే చేపట్టనుంది. ఈ సర్వేలో ఆరోగ్య కార్యకర్తలు ఆశావర్కర్లు, వాలంటీర్ లు పాల్గొంటారు. జ్వరం ఉన్నవారికి కరోనా టెస్టులు నిర్వహిస్తారు. సాధారణ జ్వరం ఉంటే మాత్రలు ఇచ్చి…అదే కరోనా ఉంటే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళతారు. కరోనా ను ఆదిలోనే అరికట్టడానికి ఏపు సర్కార్ ఈ ప్లాన్ చేసింది. ఇక రాష్ట్రంలో ఇప్పటికీ అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version