గుండెపోటుతో పట్టణాల కంటే గ్రామాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. దానికి కారణం పట్టణాల్లో ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయి. సరైన సమయానికి ఆసుపత్రికి వెళితే ప్రాణాలు రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఆస్పత్రుల్లో చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండటం వల్ల ప్రాణాలు రక్షించబడతాయి. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గుండె చికిత్స అందుబాటులో లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో సెమీ ప్రాజెక్టులు చేపట్టింది. మొత్తం 24 కేంద్రాల్లో ప్రాజెక్టు చేపట్టింది. దీనిద్వారా గుండెపోటు వచ్చిన వారికి గోల్డెన్ చికిత్స అందుబాటులోకి తేనుంది. దీనికోసం జిల్లా,పట్టణ, గ్రామీణ ఆసుపత్రులకు చికిత్సకు అవసరమైన యంత్రాలను సరఫరా చేస్తోంది. అనంతరం చికిత్సను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.